స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా మహిళా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు..నలుగురికి అవకాశం ఇచ్చిన సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ 

స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా మహిళా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు..నలుగురికి అవకాశం ఇచ్చిన సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ మహిళా పోలీసులకు వినూత్న బహుమతి ఇచ్చారు. నలుగురు మహిళా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లను స్టేషన్ హౌస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు‌‌‌‌‌‌‌‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లను బదిలీ చేశారు.

ఈ సందర్భంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో పోటీ పడుతున్నారని అన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. కాచిగూడ ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ చంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెయిన్‌‌‌‌‌‌‌‌ పీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌(లేక్) పీఎస్ ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ ముత్తినేని సత్యనారాయణను నల్లకుంట ట్రాఫిక్ ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓగా బదిలీ చేశారు.

   పేరు                    ప్రస్తుత స్థానం                           ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓగా పోస్టింగ్‌‌‌‌‌‌‌‌

జ్యోస్నా తల్లోజు     డబ్ల్యూపీఎస్‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌        కాచిగూడ పీఎస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ 

 దోమాట దిబోరా    మెయిన్ పీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                          డబ్ల్యూ పీఎస్, సెంట్రల్ జోన్

 చిట్టి బుర              టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ అడ్మిన్                     సెక్రటేరియెట్(లేక్) పీఎస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ

 వెంకటలక్ష్మి        సీసీఎస్‌‌‌‌‌‌‌‌                                            నాంపల్లి ట్రాఫిక్ పీఎస్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ